హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సాయం

KMR: హంగర్గ గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయనకు నలుగురు పిల్లలు ఉండటంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ఇస్మాయిల్ పదో తరగతి బ్యాచ్ స్నేహితులు కలిసి రూ.40 వేల ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితుల సేవాభావాన్ని పలువురు అభినందించారు.