హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా వినాయక చవితి నిర్వహించాలి: జిల్లా ఎస్పీ

SS: జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించుకోవాలని ఎస్పీ సతీశ్‌కుమార్ సూచించారు. భారీ శబ్దాలతో డీజేలు వాడితే వృద్ధులు, ఆసుపత్రి రోగులు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఇతర మతాల మనోభావాలను గౌరవించాలని కోరారు. పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని, ఊరేగింపులు నిర్దేశిత సమయాల్లోనే పూర్తి చేయాలని ఆదేశించారు.