NLG: హరిజనాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ వైద్యులు కంటి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. ఉచితంగా బీపీ పరీక్షలు కూడా చేశారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు తదుపరి చికిత్సకు ఏర్పాట్లు చేయనున్నారు. వైద్య సేవలు అందించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
హరిజనాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం


