హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళా ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది'

KMR: భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ చెరువులో పడిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను రక్షించి ప్రాణాలు కాపాడారు. గ్రామానికి చెందిన పుష్ప కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.