హైదరాబాద్: 28°C
క్రీడలు

హాకీ వరల్డ్ కప్: భారత్ vs చైనా మ్యాచ్ డ్రా

నెదర్లాండ్స్‌ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్‌ డ్రాతో ప్రారంభించింది. చైనాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్ తరఫున నవనీత్ కౌర్, దీపిక గోల్స్ చేయగా, చైనా తరఫున జాంగ్ యింగ్, మా నింగ్ గోల్స్ చేసి స్కోర్‌ను సమం చేశారు. ఈ టోర్నీలో భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 18న సౌతాఫ్రికాతో తలపడనుంది.