SRCL: ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ శివారులో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మల్లారెడ్డిపేటకు చెందిన దంపతులు ద్విచక్ర వాహనంపై సిరిసిల్లకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సుల్తాని యాదిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి


