హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక నిల్వలపై టాస్క్ ఫోర్స్ దాడులు

KNR: కొత్తపల్లి మండలం ఎలగందుల పంచాయతీ పరిధిలోని గూడెంలో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు ప్రాంతాల్లో సుమారు 80 ట్రాక్టర్ల అక్రమ ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ సతీశ్ తెలిపారు. తదుపరి విచారణ కోసం డంపులను కొత్తపల్లి పోలీసులకు అప్పగించారు. సీపీ గౌస్ అలం ఆదేశాలతో అక్రమ ఇసుక రవాణాపై దాడులు కొనసాగుతాయని తెలిపారు.