హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్రానికి వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర

SRD: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డిలో పాదయాత్ర నిర్వహించారు. మార్క్స్ నగర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రహమాన్ డిమాండ్ చేశారు.