హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

NGKL: వరుస సెలవుల నేపథ్యంలో శని, ఆదివారాల్లో జూరాల ప్రాజెక్టు, కృష్ణానది వరద నీటి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా సొంత వాహనాల్లో రావడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.