MDK: హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓపెన్ నేషనల్ కరాటే పోటీల్లో మెదక్ విద్యార్థులు ప్రతిభ చాటారు. అండర్-10 టీమ్ కటాస్ విభాగంలో సహాస్, ప్రణయ్, జున్ను ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. విజేతలను మాస్టర్లు నవీన్, రాకేష్‌తో పాటు రెంజుకి షోటొకన్ కరాటే సంస్థ అధ్యక్షుడు నగేష్ అభినందించారు.
తెలంగాణ
నేషనల్ కరాటేలో గోల్డ్ మెడల్స్


