NLG: చిట్యాల పోలీసులు పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు బాపాల సత్యనారాయణ సహచరులతో కలిసి రసాయన ట్యాంకర్ల నుంచి రసాయనాలను డ్రమ్ముల్లో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి, ఐదు వాహనాలను సీజ్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
తెలంగాణ
'అక్రమ రసాయనాల ముఠా అరెస్ట్'


