NZB: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పూర్వ విద్యార్థులు సహకరించాలని పలువురు కోరారు. ధర్పల్లి మండలం సీతాయిపేటకు చెందిన పూర్వ విద్యార్థి సుంకేటి మహిపాల్ తన తాతయ్య, నాయనమ్మల జ్ఞాపకార్థం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.30 వేల వ్యయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. దీనిని సర్పంచ్ భూమేష్, ఉపసర్పంచ్ చంద్రకాంత్ ప్రారంభించారు.
తెలంగాణ
'ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు'


