హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండూర్‌లో పడిపోతున్న గాలి నాణ్యత

VKB: జిల్లాలోని తాండూర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీలు, రాయి కటింగ్ యూనిట్లు, భారీ వాహనాల రాకపోకలతో గాలి నాణ్యత పడిపోతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌జీటీ ఆదేశాలున్నా చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. బైపాస్ పూర్తి చేసి, రోడ్లపై నీరు చల్లడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.