హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గన్యా తండాలో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు'

NZB: జక్రాన్‌పల్లి మండలం గన్యా తండా జగదాంబ మందిరంలో తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాడిపశువులు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ పెళ్లికాని యువతులు ఏడు రోజులపాటు ఉపవాసం పాటించారు. మందిరం వద్ద గోధుమ మొక్కలకు నీరు పోసి పెంచి, అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందని సర్పంచ్ రాజేష్ తెలిపారు.