హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో పాల ప్యాకెట్ల చోరీ

BPT: చీరాల పట్టణంలో తెల్లవారుజామున పాల ప్యాకెట్ల చోరీలు ఎక్కువవుతున్నాయి. వ్యాన్‌లు దుకాణాల వద్ద పాల బాక్సులు పెట్టి వెళ్లగానే, ద్విచక్ర వాహనాలపై వచ్చి దొంగలిస్తున్నారు. మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ సమీపంలోని సంఘం డైరీ వద్ద జరిగిన దొంగతనం సీసీటీవీలో నమోదైంది. నిరంతరం జరిగే ఈ చోరీలపై పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పాల వ్యాపారులు కోరుతున్నారు.