హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నిబాధితులకు రెడ్ క్రాస్ సహాయం

BPT: చీరాల మండలం దేవనూతల గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూతనందించింది. తహసీల్దార్ గోపి కృష్ణ సూచనతో చీరాల రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో బాధితులకు గృహోపకరణాలు, బ్లాంకెట్లు, టార్పాలిన్ పట్టాలను పంపిణీ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సమాచారం అందించి బాధితులకు సహాయపడాలని రెడ్ క్రాస్ ప్రతినిధులు కోరారు.