హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ వార్షికోత్సవ వేడుకలను ఐక్య గౌడ సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. నేటి యువత పాపన్న గౌడ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేరిపోతుల వెంకన్న గౌడ్ పాల్గొన్నారు