హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న హుండీ లెక్కింపుకు ఏర్పాట్లు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 18న హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో స్వామివారి హుండీలను విప్పి లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.