SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు మంచిర్యాల జిల్లాకు చెందిన గూడెల్లి వందన–సుమంత్‌రెడ్డి దంపతులు రూ.50,001 విరాళంగా అందజేశారు. దేవస్థానం పీఆర్వో పెరుక శ్రీనివాస్‌కు నగదును అందించారు. అనంతరం రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు.
తెలంగాణ
రాజన్న ఆలయ అభివృద్ధికి భక్తుల విరాళం


