హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో మెగా వైద్య శిబిరం

SRD: రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా, ఓ ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జి.అంజయ్య ఈ శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 400 మందికి బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.