హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కటికం సైదిరెడ్డిని పరామర్శించిన భాస్కర్‌రావు'

NLG: దామరచర్ల మండల మాజీ వైస్ ఎంపీపీ కటికం సైదిరెడ్డిని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పరామర్శించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన సైదిరెడ్డి ప్రస్తుతం స్వగృహంలో కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న భాస్కర్‌రావు ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.