హైదరాబాద్: 28°C
క్రీడలు

జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు

తన కెరీర్ తొలినాళ్లలో 8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని జడేజా తెలిపాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తాను 60కి పైగా సగటుతో 8,337 పరుగులు చేశానని గుర్తుచేశాడు. కానీ టీమిండియాలోకి వచ్చాక తన బ్యాటింగ్ సామర్థ్యంపై కోచింగ్ స్టాఫ్ మొదట్లో నమ్మకం ఉంచలేదన్నాడు. అయితే, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నాడు.