హైదరాబాద్: 28°C
క్రీడలు

టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు.. 4వ స్థానంలో పంత్

టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రిషభ్ పంత్ 4వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో పంత్ ఒక సిక్సర్ కొట్టడంతో.. టెస్టు కెరీర్‌లో 98 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో గేల్(98), టిమ్ సౌథీ(98)తో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు. స్టోక్స్(138), మెక్‌కల్లమ్(107), గిల్‌క్రిస్ట్(100) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.