హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గూడెం దేవాలయంలో శ్రావణ మాస పూజలు

MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణమాసం కావడంతో ఆదివారం ఉదయం మంచిర్యాల జిల్లాతో పాటు పలు ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చి గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేశారు. స్వామివారికి పూజలు నిర్వహించారు. జంటలు యజ్ఞశాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు.