MNCL: మందమర్రి మండలం వెంకటపూర్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు ఇవాళ పరిష్కారం లభించింది. రెండు రోజుల క్రితం బోర్ మోటార్ కాలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై సర్పంచ్ సేగ్యం వెంకటేష్ స్పందించారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు సొంతం ఖర్చులతో కొత్త మోటార్‌ను తెప్పించి బిగించారు. సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
తాగునీటి కష్టం తీర్చిన సర్పంచ్


