MDK: నర్సాపూర్ డిపో నుంచి యాదగిరిగుట్టకు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించినట్లు డీఎం పరమేశ్వరి తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మంగళపర్తి, వెల్దుర్తి, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా యాదగిరిగుట్ట చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12:30కు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం


