KMR: రామారెడ్డి మండలం రంగంపేట శివారు ప్రాంతంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోగోటి జగదీష్ రైలు కింద పడి మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ నిర్ణయానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రైలు కింద పడి వ్యక్తి మృతి


