హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ప్రజావాణి కార్యక్రమం: MPDO

SRD: కంగ్టి ఎంపీపీ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో దయాకర్ రావు తెలిపారు. ఇకపై ప్రతి వారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అందజేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.