హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిపాడు హైవే సమీపంలో అగ్ని ప్రమాదం

NLR: దుత్తలూరు మండలం నందిపాడు హైవే సమీపంలో మండ్ల వెంకటేశ్వర్లుకు చెందిన రెండు పూరిళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో ఇళ్లలోని గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.