హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఆర్.కృష్ణయ్య

SRD: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లోని పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు తమ వేతన సమస్యలపై ఎంపీ ఆర్.కృష్ణయ్యను కలిశారు. ఒకే గురుకులంలో వేర్వేరు వేతనాలు ఉన్నాయని, 'సమాన పనికి సమాన వేతనం' ఇచ్చి న్యాయం చేయాలని విన్నవించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్.కృష్ణయ్య హామీ ఇచ్చారు.