హైదరాబాద్: 28°C
తెలంగాణ

పవిత్రోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

KMM: పులిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్న పవిత్రోత్సవ సహిత విగ్రహ స్థాపన మహోత్సవానికి ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దేవస్థాన ఛైర్మన్ ఈవూరి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానపత్రిక అందజేసి సత్కరించారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.