హైదరాబాద్: 28°C
తెలంగాణ

​కూచారంలో రేపు మంత్రి పర్యటన

MDK: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో కస్తూర్బా గాంధీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం రానున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొననున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు.