హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పనులు ప్రారంభం.. కాలనీ వాసుల హర్షం

మహబూబాబాద్ మున్సిపాలిటీ 21వ వార్డులోని తోట బిక్షం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కౌన్సిలర్‌ జరీన జాకీర్‌ ఆదివారం ప్రారంభించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు పనులు ప్రారంభం కావడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు పనులు చేపట్టిన కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.త్వరలో మరిన్ని సీసీ రోడ్ల పనులు చేపడతామన్నారు.