WG: భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం కంటి చూపు అని లయన్స్ క్లబ్ రీజియన్ ఛైర్మన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం కడగట్లలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి చూపులో ఏ సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలన్నారు. లేకుంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 113 మందికి కంటి పరీక్షలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కడగట్లలో ఉచిత కంటి వైద్య శిబిరం


