KDP: చెన్నూరు మండలం ఉప్పరపల్లి, కొక్కిరాయపల్లి సమీప పొలాల్లో కేసీ కెనాల్ కాలువ పలుచోట్ల దెబ్బతింది. కాలువల లైనింగ్ ఊడిపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని రైతులు తెలిపారు. కాలువలు కోతకు గురికావడంతో సాగునీటి సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధికి నోచుకోని కేసీ కెనాల్


