హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలమూరు జనార్ధన స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ: ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామివారిని విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు స్వాగతం పలకగా, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. 5000 ఏళ్ల నాటి ప్రసిద్ధ నవ జనార్ధన ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఆలయ చరిత్ర, విశిష్టత తమను ఎంతో ఆకట్టుకుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.