హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి: BRTU

GDWL: ఆశా వర్కర్ల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్టీయూ జిల్లా ఇంఛార్జ్ గంజిపేట రాజు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు రూ.18 వేల స్థిర వేతనం, కేంద్రం పెంచిన రూ.1,500 ఇవ్వాలని కోరారు. బకాయిలు చెల్లించి, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, ఈనెల 18న హైదరాబాద్లో జరిగే సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.