యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శ్రీలంకతో తొలి టెస్టులో సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. నిన్న సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ఈరోజు వేగంగా ఆడుతూ 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఈ క్రమంలో గాలే వేదికగా 150+ స్కోర్ చేసిన రెండో భారత నెం.3 బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో పుజారా ఈ స్టేడియంలో 153 పరుగులు చేశాడు. పడిక్కల్ జోరు చూస్తుంటే డబుల్ సెంచరీ చేసేలా కనిపిస్తున్నాడు.
క్రీడలు
డబుల్ సెంచరీ దిశగా పడిక్కల్


