VZM: వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు'


