కోనసీమ: అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల సమీపంలో ఆదివారం రెండు బైక్లు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న దంపతులను మరో బైక్పై వచ్చిన యువకుడు అతివేగంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం... ఒకరి పరిస్థితి విషమం


