హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంపులలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

PDPL: ఓదెల మండలం గుంపుల గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో రైతుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన హాకా ఫార్మర్ సర్వీస్ సెంటర్‌ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.