హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

SRD: మండల స్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలో ‘ప్రజావాణి’ నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 17న జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు అందుబాటులో ఉంటారని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేసి పరిష్కారం పొందాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.