హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో ‘బలిజ భవన్’ ప్రారంభం

NLR: నెల్లూరు బాలాజీ నగర్‌లో నూతనంగా నిర్మించిన 'బలిజ భవన్' కల్యాణ మండపాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. రూ.55 లక్షల తన వంతు విరాళంతో పాటు భవన నిర్మాణానికి సహకరించిన దాతలను ఆయన అభినందించారు. పేదలకు బియ్యం పంపిణీ, విద్యార్థులకు ఆర్థిక సాయం, వంటి సేవా కార్యక్రమాలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ప్రముఖులు పాల్గొన్నారు.