హైదరాబాద్: 28°C
తెలంగాణ

"రేపు నర్సంపేటలో మండల స్థాయి ప్రజావాణి"

WGL: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రేపు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నర్సంపేట ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ప్రజావాణిని మండల, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.