KDP: ముద్దనూరులో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నగేష్‌బాబు రౌడీషీటర్లను హెచ్చరించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రౌడీలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, గొడవలకు దూరంగా ఉండి మంచి ప్రవర్తనతో నడుచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు ముద్దనూరు సీఐ కౌన్సెలింగ్


