NTR: మ్యాట్రిమోనీ యాప్స్, వెబ్‌సైట్లలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. నకిలీ ప్రొఫైల్స్‌తో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు వసూలు చేసే మోసాలు జరుగుతున్నాయన్నారు. అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి, ఆకట్టుకునే మాటలతో వల వేసి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మ్యాట్రిమోనీ యాప్స్‌తో జాగ్రత్త: ఏసీపీ


