AP: తిరుపతిలోని చంద్రగిరి సమీపంలో ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఏనుగులతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీ పెంచాలని ఆదేశించారు. పంట నష్టంపై నివేదికలు అందిన వెంటనే తక్షణ పరిహారం అందించాలని తెలిపారు.
క్రీడలు
రాత్రివేళ గస్తీ పెంచాలి: డిప్యూటీ సీఎం


