హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొదలకూరులో ఘనంగా గౌతు లచ్చన్న గౌడ్ జయంతి

NLR: పొదలకూరులో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆ సంఘం నేత పర్వతాల చంద్రశేఖర్ గౌడ్, సంఘం నాయకులతో కలిసి లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. సమాజానికి లచ్చన్న చేసిన సేవలను నాయకులు కొనియాడారు.