కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాసేవకుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు, కూలీల హక్కుల కోసం లచ్చన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గౌతు లచ్చన్నకు కడప జిల్లా పోలీసుల ఘన నివాళి


