ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలపాతం ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం వద్ద ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. గార్డెన్‌లో కొద్దిసేపు గడిపి ఫొటోలు దిగారు. పర్యాటకుల రాకతో చాపరాయి పరిసరాల్లో సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
చాపరాయి జలపాతం వద్ద సందడి


